సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలి

  • జనసేన ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
  • వరికూటి అశోక్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి

కొండెపి  నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. జలయజ్ఞం కాదు జలదోపిడీ, సంగమేశ్వరం అంతా అవినీతి పాలకులమయం, ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా కాంట్రాక్టర్లు మారినా సంవత్సరాలు గడిచినా సంగమేశ్వరం అడుగులు ముందుకు పడలేదు. పొన్నలూరు మండలంలో చెన్నిపాడు సమీపంలో సంగమేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది, 2009లో పోతుల చెంచయ్య రిజర్వాయర్ పేరుతో సంగమేశ్వరం ప్రాజెక్టుకు పాలేరు నదిలో 50.50 కోట్లతో జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం చేపట్టారు, దశాబ్దాలు దాటుతున్నా పూర్తి కావడం లేదని జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తరువాత టిడిపి ప్రభుత్వం కొండేపి నియోజకవర్గం ప్రజలకు శాశ్వతంగా త్రాగు మరియు సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మాటలు చెప్పారే కానీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నా పాలకులు లేరని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జలదోపిడీ చేశారని ఆరోపించారు, టిడిపి హయామంలో పోతుల చెంచయ్య రిజర్వాయర్ కాస్త దామచర్ల ఆంజనేయులు రిజర్వాయరుగా మార్చారని, పేర్లతో పాటు అంచనాలు కూడా మార్చారు తప్ప ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం టిడిపి వైసిపి పార్టీలు పోటాపోటీగా సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి జరుగుమల్లి, కొండేపి, పొన్నలూరు మండలాల్లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రాజెక్ట్ కు నిధులు మంజూరు చేయలేదని, తమది రైతు ప్రభుత్వమని డాంబికాలు చెప్పే జగన్ ప్రభుత్వంకు కొండేపి నియోజకవర్గ పరిధిలోని రైతుల బాధలు కనబడటం లేదా అని ప్రశ్నించారు, ఇదేనా రైతు ప్రభుత్వం అని మండిపడ్డారు. త్వరలోనే వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు మరియు రైతులకు న్యాయం చేయకపోతే కొండేపి నియోజకవర్గ ప్రజలు మరియు రైతుల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో, వరికూటి అశోక్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు గురించి జనసేన పార్టీ ముఖ్య నేతలు షేక్ రియాజ్ మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సభ్యులు కూనపురెడ్డి హరిప్రసాద్, ప్రపంచ ఆర్యవైశ్యుల మహాసభ సభ్యులు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా, టిడిపి కొండపి తెలుగు యువత అధ్యక్షుడు గట్టిబోయిన మల్లికార్జున యాదవ్, టిడిపి నాయకులు మాదాల చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుమలరెడ్డి, పిల్లిపోగు పీటర్ బాబు, పెయ్యల రవి, షేక్ మహబూబ్ బాషా, సుంకేశ్వరం శ్రీను, ఆంజనేయులు, నాగేంద్ర బాబు, మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు.