శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుక

శ్రీకాళహస్తి నియోజకవర్గం: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నియోజకవర్గ మహిళలతో కలిసి పట్టణంలోని వారి నివాస గృహం వద్ద పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజల కష్టాలు తీరాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పూజ అనంతరం మహిళలకు వినుత వాయినం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.