తొర్రూరు పట్టణానికి డ్రైనేజీ సిస్టం తీసుకురావాలని జనసేన డిమాండ్

పాలకుర్తి, పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు పట్టణంలో ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవేకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా లోతైన గోతులతో ఉండడం వల్ల ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని ఈ సమస్యను మినిస్టర్ తొందరగా తీర్చాలని జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామని, ఇంతకుముందు కూడా తొరూరు పట్టణంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. రోడ్డుకిరువైపులా ఈ ప్రమాదకరమైన గోతులను నివారించాలని తొర్రూరు పట్టణానికి డ్రైనేజీ సిస్టం తీసుకురావాలని కోరుతున్నాము మన తొర్రూరు పట్టణం ఆర్థిక రంగంలో వ్యాపార రంగంలో ముందున్నది తొర్రూరు పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా డివైడర్ కు నాటిన మొక్కల ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, ఈ మొనో కార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించాలని మినిస్టర్ ని రిక్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొండ్లే ఉమేష్ మరియు జనసేన సైనికులు పాల్గొనడం జరిగింది.