ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు..

బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ మూవీస్ చేస్తూ సంచలనం రేపుతున్నాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మైలురాయిని సాధించాడు. సినిమ అప్‌డేట్స్ త‌ప్ప పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్ట‌ని ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు మిలియ‌న్స్‌ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగులో మ‌హేష్ బాబుకు 6.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, అల్లు అర్జున్ 10.2 మిలియ‌న్ , విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు 10.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రాల‌తో బిజీగా ఉన్నారు ప్ర‌భాస్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాధే శ్యామ్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.