రెల్లి జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన పవన్ కళ్యాణ్

  • గుంటూరులో రెల్లి కాలనీల్లో ఘనంగా ప్రారంభమైన జనసేనాని జన్మదిన వేడుకలు
  • రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రోజే తమ గుండెల్లో ఆయనకు శాశ్వత స్థానం ఇచ్చామన్న రెల్లి సంఘం
  • రెల్లి మహిళలతో, యువతతో ఆడిపాడిన జనసేన పార్టీ నేతలు
  • రాష్ట్రవ్యాప్తంగా జనసేనానికి నీరాజనాలు పడుతున్న రెల్లి సంఘీయులు
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా తన పుట్టినరోజు వేడుకల్ని కూడా రెల్లి కాలనీల్లో జరపాలంటూ పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెల్లి జాతి ఆత్మగౌరవాన్ని పెంచారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. రెల్లి యువత రాష్ట్ర నాయకుడు సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కొండా వెంకటప్పయ్య కాలనీలో రెల్లి కులస్తులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా రెల్లి కులస్తుల జీవన విధానం గురించి, వృత్తి రీత్యా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించలేదన్నారు. రెల్లి కులస్తులను అక్కున చేర్చుకున్న పవన్ కల్యాణ్ కు దళిత, బీసీ వర్గాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రోజే మా గుండెల్లో ఆయనకి గుడి కట్టుకున్నామన్నారు. తమకు ఆకాశమంత ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామనన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయన కోసం తాము ప్రాణాలివ్వటానికైనా సిద్ధమని రెల్లి మహిళలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు రెల్లి కాలనీల్లో పర్యటించారు. రెల్లిల ఆరాధ్యదైవమైన వడ్ల పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత రెల్లి యువత బాణాసంచా కాలుస్తూ, డప్పులతో నేరేళ్ళ సురేష్ కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, బుడంపాడు కోటి, తోట కార్తిక్, పులిగడ్డ గోపి, మిరియాల వెంకట్ డివిజన్ అధ్యక్షులు చెన్నం శ్రీకాంత్, సయ్యద్ షర్ఫుద్దీన్, కదిరి సంజీవ్, గడ్డం రోశయ్య, కాటూరి శ్రీను, రెల్లి నేతలు మాడుగుల వెంకటేశ్వరరావు, నాని, నరసింహరావు, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.