పవన్ కళ్యాణ్ జన్మదినాన మదనపల్లెలో సేవా కార్యక్రమాలు

మదనపల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శుక్రవారం రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో చైతన్య అనాధ శరణాలయంలో 87 మంది బాల, బాలికలకు నూతన వస్త్రములు పంపిణీ కార్యక్రమం చేసి పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న జనసేన పార్టీ నినాదంతో ఆవిర్భవించిందని అన్నారు. కావున ఇతర రాజకీయ పార్టీల లాగా అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా అధినేత పవన కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పుట్టిన రోజున 10 మందికి సాయం చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆలా చేస్తే నామనస్సుకు నచ్చుతుంది కానీ వృధా ఖర్చులు చేస్తే నా మనసు మాటలు చెప్పిన విధంగా మదనపల్లిలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, ఐటీ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ, జిల్లా జాయింట్ సెక్రెటరీ సనా ఉల్లా, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, మజ్జల నవీన్, గండి కోట లోకేష్, అర్జున, మోహన, కుమార్, నవాజ్, రెడ్డెమ్మ, జంగాల గౌతమ్, శేఖర తదితరులు పాల్గొన్నారు.