గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు
పాలకొండ నియోజకవర్గం: పాలకొండ లో గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా “పాలకొండ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి యాలం కోడలి వరకు 250 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.” అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద “15 కే.జిల కేక్ “కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ… పాలకొండలో మార్పు మొదలైందని, కుటుంబ పాలనకు జనసేనతో ముగింపు పలుకుతామని ఆయన అన్నారు. మరియు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పాలకొండ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మరియు జనసేన నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరావు మాట్లాడుతూ.. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం సీటు గెలిచి మా అధినేత పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో 4మండలాల జనసైనికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-7.03.49-PM-1024x576.jpeg)