అనంతసాగరం మండలంలో జనసేనాని జన్మదిన వేడుకలు

ఆత్మకూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా అనంతసాగరం మండలంలో కేకే కట్ చేసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసి, సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో అనంత సాగరం మండలంలోని పాతదే రాయ పల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్సిళ్ళు బలపాలు, ఏరేజర్స్ అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు షేక్ సుభని, మన్సూర్, అబ్దుల్లా, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.