రాజానగరంలో అంగరంగ వైభవంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • రాజానగరం బస్టాండ్ వద్ద భారీ అన్న సమారాధన

రాజానగరం, జనహితం కోరే జనసేనాని, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరం బస్సు స్టాండ్ వద్ద శనివారం ఉదయం 11 గంటల నుండి భారీ ఎత్తున జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భవన నిర్మాణ కార్మికులకు, ప్రయాణికులకు, బాటసారులకు స్వయంగా అన్నవితరణ చేసారు. అనంతరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారితో కలిసి భోజనం చేయడం అజ్రిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • సీతానగరం బస్టాండ్ వద్ద భారీ అన్న సమారాధన

రాజానగరం, జనహితం కోరే జనసేనాని, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సీతానగరం బస్సు స్టాండ్ వద్ద శనివారం ఉదయం 11 గంటల నుండి భారీ ఎత్తున జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భవన నిర్మాణ కార్మికులకు, ప్రయాణికులకు, బాటసారులకు బత్తుల బలరామకృష్ణ స్వయంగా అన్నవితరణ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • వెదుళ్లపల్లి గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించిన బత్తుల

జనహితం కోరే జనసేనాని, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సీతానగరం మండలం, వెదుళ్లపల్లి గ్రామంలో గల శ్రీ బొల్లి మునియ్య మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతీ ఒక్క విద్యార్థి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో భాగంగా రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దివ్యాంగులకు ట్రై సైకిల్స్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *