చిత్తపూరు గ్రామంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

నూజివీడు నియోజకవర్గం:  జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా శనివారం చాట్రాయి మండలం, చిత్తపూరు గ్రామంలో వలసపల్లి రామకృష్ణ, ఆరెల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు, జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చీమట గోపాలకృష్ణ, గంగుల రాజా, మురళి, ఆరు ముళ్ళ రాజా, కొప్పుల నాగరాజు, ఉలాస రాంబాబు, సోదిమల్ల ప్రకాష్, నందిపాము వంశీ, చిన్నప్ప, శీకాకొల్లు మేరీ దాస్, గోపి, ప్రభుదేవ్, సిద్దు, తంబి తదితర జనసైనికులు పాల్గొన్నారు.