జాతీయ స్థాయి అబాకస్ పోటీలో ఎం ఆర్ ఇన్స్టిట్యూట్ ఎన్నిక అభినందనీయం: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: ఆన్లైన్ జాతీయ స్థాయి అబాకస్ పోటీలో ఎం ఆర్ ఇన్స్టిట్యూట్ టాప్ 5లో ఎన్నిక అభినందనీయమని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ జాతీయ స్థాయి అబాకస్ పోటీలో మొదటి 3 రౌండ్స్ లో 600 మంది విద్యార్థులు టాప్ 100 మందిలో మన ఎం.ఆర్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు స్థానం రావడం, అనంతరం రెండవ రౌండ్లో 50 మంది సెలెక్ట్ అవ్వడం, మూడో రౌండ్లో ఐదుగురు సెలెక్ట్ అవడం, ఆ ఐదుగురు నుంచి మన తాడేపల్లిగూడెం ఎం ఆర్ ఇన్స్టిట్యూట్ కి మెడల్స్ మరియు స్టైఫ్అండ్ రావడం అభినందనీయం అన్నారు. అనంతరం ఎం.ఆర్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ సుధారాణిని శాలువా, పుష్పగుచ్చంతో శ్రీనివాస్ సత్కరించి విద్యార్థులకు మెడల్స్ అందజేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు నబ్బి అబ్బాయి జన్మదినం సందర్భంగా పిల్లలకు ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్, పెన్సు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాతి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, దళిత నాయకులు చాపల రమేష్, జనసేన నాయకులు అడబాల మురళి, కూచిపూడి వెంకటరత్నాజీ, సోషల్ మీడియా ఇంచార్జ్ బయినపాలెపు ముఖేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.