పామిడి మండల జనసేన నేతల అక్రమ అరెస్టు

  • తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన పామిడి మండల జనసేన

పామిడి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు మద్దతుగా, ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తూ పామిడి మండల జనసేన ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. శాంతియుత నిరసన చేస్తున్న జనసేన పార్టీ నాయకులను, టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు యం.ధనుంజయ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుందని పేర్కొన్నారు.