కృత్తివెన్ను మండల పర్యటనలో యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: కృత్తివెన్ను మండల పర్యటన నేపథ్యంలో సోమవారం గోవిందరాజులుదిబ్బ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, అమ్మవారి దేవాలయం వద్ద గ్రామస్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు, కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి చంద్రమౌళి, కృత్తివెన్ను మండలం ఉపాధ్యక్షుడు పాశం నాగమల్లేశ్వర రావు, కార్యదర్శులు తెలగంశెట్టి ఏడుకొండలు, కొప్పినేటి నరేష్, కాజ మణికంఠ, బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, పోలగాని లక్ష్మీ నారాయణ, అశోక్ కుమార్, మల్లిబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.