టిడిపి రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన విడివాడ
తణుకు నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు గాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో నరేంద్ర సెంటర్ నుండి పైడిపర్రు ఫ్లైఓవర్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. అనంతరం నరేంద్ర సెంటర్లో రామచంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-6.14.44-PM-1024x576.jpeg)