మనోహర్ నాయుడుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి: దోమకొండ అశోక్

విజయవాడ: గుంటూరు నగర వైసిపి మేయర్ కావటి మనోహర్ నాయుడుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు సంఘీభావంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న గుంటూరు నగర జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయించి. రోడ్డు మీదకి వచ్చి మీడియా ముఖంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. మనోహర్ నాయుడు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి అని గుంటూరు పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నాను. కావటి మనోహర్ నాయుడు నీలాంటి పాలేరు కుక్కలు వైసిపి పార్టీకి ఊడిగం చేస్తుంటే కాపు, దళిత, బడుగు బలహీన వర్గాల కోసం వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
జనసేన పార్టీ గుండాలు అని వ్యాఖ్యానించిన నువ్వు అసలు గుండాయిజం, రౌడీయిజాన్ని పెంచి పోషిస్తుంది మీ నాయకుడు మీరు కాదా? ప్రజా ప్రతినిధి అయ్యుండి ప్రజల గౌరవాన్ని పెంచాల్సిన నువ్వు ప్రజలు సిగ్గుపడేలా మాట్లాడుతున్నావ్, చంద్రబాబు కోసం రోడ్డు మీద పడుకున్నాడు అంటున్నావ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది వారికి షెడ్యూల్ గురించి చర్చించేందుకు, ఆయన రోడ్డు మీద పడుకునేలా చేసింది మీరే, ఆంధ్రప్రదేశ్ లోకి రావాలి అంటే వీసా, పాస్పోర్ట్ కావాలా ఒక వ్యక్తి స్వేచ్ఛని హరిస్తున్న మీరు రాజ్యాంగా హక్కులను కాలరాస్తున్నట్లే. నా జాతి ఆత్మగౌరవాన్ని జనసేన పార్టీ ద్వారా పెంచుతున్నాను. నా జాతి హక్కుల కోసం జనసేన పార్టీ ద్వారా పోరాడుతున్నాను. మరి నువ్వేం చేస్తున్నావ్ నీ జాతిని జగన్మోహన్ రెడ్డి వంచిస్తుంటే పాలేరు లాగా పని చేస్తున్నావ్. నగర మేయర్ గా నువ్వు ఎంతమందికి కార్పొరేషన్ లోన్లు ఇప్పించావు సమాధానం చెప్పు. గుంటూరు నగరాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారో చెప్పు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ప్రజా ప్రతినిధి అని మరిచిపోయి అసభ్య పదజాలం వాడే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి అని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ హెచ్చరించారు.