ఉగాదికి వస్తున్న వకీల్ సాబ్..

పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ మూవీ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుత స్పందన రావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు.