క్రియాశీలక సభ్యత్వం జనసైనికుల జీవితాలకు భరోసా

పాయకరావుపేట నియోజకవర్గం: కోటవురట్ల దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసైనికులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా భరోసా ఇస్తుందని జనసేన “పార్టీ కోటఉరట్ల టౌన్ అధ్యక్షుడు దువ్వాది బద్రి అన్నారు. గురువారం కోటవురట్ల మండల పరిధిలోలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ జనం కోసం మేమున్నాం అనే ధైర్యం నింపుతూ ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుల్లో నడుస్తూ ఆశయాల ప్రయాణాన్ని సాగిస్తున్న తన సైన్యం ఎలాంటి ఆపత్కాలంలో ఇబ్బందులు పడకూడదని ఎంతో నిబద్ధతతో పార్టీ భావజాల వ్యాప్తికి, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ కొరకు అనుక్షణం శ్రమించే పార్టీ కార్యకర్తలను కుటుంబంగా భావించి వారి యోగ క్షేమాలు కాంక్షించి జనసేనాని చేపట్టిన మహా సంకల్పం ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అన్నారు. నిరంతరం పార్టీ కొరకు శ్రమించే
కార్యకర్తలకు 5 లక్షల భీమా సౌకర్యం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించారన్నారు. సభ్యత్వం తీసుకొనే వారు నామమాత్రంగా కొద్దిపాటి వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి 500 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5లక్షల భీమా కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే రూ.50వేలు ప్రమాద భీమాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా వైద్య సేవలు అందుకునే వెసులుబాటుతో పాటు ఆరోగ్య భీమా అందిస్తారన్నారు. కావున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోట ఊరట్ల మండల టౌన్ అధ్యక్షులు బద్రి, మండల పవన్ అభిమానులు గొర్లి రాఘవ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.