టిడిపి రిలే నిరాహార దీక్షకు అరకు జనసేన మద్దతు

అరకు నియోజకవర్గంలొ టీడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కిడరీ శ్రావణ్ కుమార్ మాజీ మంత్రివర్యులు అరకు నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జ్ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలో శనివారం అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు, జనసేన పార్టీ బృందము కొన్నేడి లక్ష్మణరావు, చేట్టి చిరంజీవి, ముత్యం ప్రసాద్, దుర్యా సాయిబాబా, అల్లంగి రామకృష్ణ, మజ్జి కృష్ణ, ముల్లంగి శ్రీనివాసరావు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారు రామదాసు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి అక్రమ కేసులను ఆంధ్రప్రదేశ్ నాయకులను, ప్రజలకు భయాందోళన చేకూరుస్తున్నారని బంగారు రామదాసు తెలియపరిచారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేయించబడి ఉన్నారని, అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదని ఈ సందర్భంగా తెలియపరచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కుళ్లు కుతంత్రాలతో ప్రజాస్వామ్యంలో వైసిపి పార్టీ కొల్లు కుతంత్రాలతో ప్రభుత్వము ఏర్పాటు చేసి ఉందని ఈ సందర్భంగా తెలియపరుచున్నారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషణాలు చేస్తుండటం దత్తపుత్రుడు అంటూ వైసీపీ పార్టీ నాయకులు అవచ్చు మంత్రులు అవ్వచ్చు విమర్శించడం సబబు కాదని, మీరు ఏదైనా రాజకీయపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి లేక పంచాయతీలో సిసి రోడ్, డ్రైనేజ్ కాలువలు గాని అలాగే పంచాయతీ పరంగా ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులు లేని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి లేని రాష్ట్రంగా వెనుకంజలో ఉన్నామని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బంగరు రామదాసు తెలియజేయడం జరిగింది. వైసిపి పార్టీ చేస్తున్నటువంటి దౌర్భాగ్య రాష్ట్ర పరిపాలన అరికట్టే దిశగా రానున్న భవిష్యత్ తరాలు బాగుండటానికి వైసిపి పార్టీని గద్దె దించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ములాకాత్ ద్వారా గౌరయులైన నారా చంద్రబాబు నాయుడుని పరామర్శించి జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రెస్ మీట్ పెట్టి రానున్న 2024 ఎలక్షన్ లో జనసేన టిడిపి ఉమ్మడిగా పోటీ చేస్తామని కలిసి వెళ్తామని ప్రకటించడంలో జరిగింది. ఈ విష్యంగా శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు జనసేన పార్టీ అరకు నియోజకవర్గం నాయకులు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అరుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు, కొన్నేడి లక్ష్మణరావు, శెట్టి చిరంజీవి, ముత్యం ప్రసాద్, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, అల్లంగి రామకృష్ణ, దురియా సాయిబాబా, మజ్జి కృష్ణ పవన్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొనడం జరిగింది.