కెపిహెచ్బి జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

కూకట్పల్లి నియోజకవర్గం: పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని కెపిహెచ్బి జనసేన నాయకులు పేర్కొన్నారు. వినాయకచవితి పండుగ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఆదివారం కెపిహెచ్బి కాలనీ థర్డ్ ఫేస్ రమ్య గ్రౌండ్ వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు తుమ్మల మోహన్ కుమార్, కొల్లా శంకర్, మరియు 114 డివిజన్ జనరల్ సెక్రెటరీ అంజి మరియు జనసేన నాయకులు కిరణ్, చంటి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.