టీడీపీ రిలే దీక్షలకు యు.పి.రాజు సంఘీభావం

రాజాం నియోజకవర్గం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గుండ లక్ష్మి దేవి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మరియు ఆమదాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కూన రవి కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు రెండు చోట్ల దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి జనసేన పార్టీ తరుపున మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోరి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు అని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి నేడు శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ లు చేస్తున్న నిరసన దీక్షకు జనసేన పార్టీ తరుపున వెళ్లి పూర్తి మద్దతు తెలియచేశాం అని అన్నారు. ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని ధీమావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావుతో పాటు రాజాం నియోజకవర్గం నాయకులు గొర్లె గోవిందరావు, ఎన్ని సత్యనారాయణ, నాగరాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.