కుడుపూరు గ్రామంలో ఇంటింటికి జనసేన
- గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం.. పవన్ అన్నను గెలిపిద్దాం
- రామచంద్రపురం నియోజకవర్గంలో 6వ రోజు పర్యటనలో భాగంగా గంగవరం మండలం, కుడుపూరు గ్రామ పర్యటన
రామచంద్రపురం నియోజకవర్గం: జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ ఆధ్వర్యంలో గంగవరం మండలంలో “ఇంటింటికి జనసేన” కార్యక్రమం ద్వారా బుధవారం సాయంత్రం గంగవరం మండలం కుడుపూరు గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్, కుడుపూరు గ్రామం ఎంపీటీసీ నంది కోళ్ల వీర వెంకట నాగేంద్ర ను కలిసి ‘ఇంటింటికి జనసేన’ కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అర్ధరాత్రి అయినా చీకటిలో జనసైనికులు సెల్ టార్చ్ వేసుకుని మరి పర్యటిస్తూ.. కుడుకూరు గ్రామ మహిళలు పోలిశెట్టి చంద్రశేఖర్ కు హారతులతో స్వాగతిస్తూ నీరాజనాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వీరమహిళలు అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-21-at-10.49.48-AM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-21-at-10.49.49-AM-1024x473.jpeg)