లాలుపురం జనసేన ఆఫిస్ నందు ఘనంగా వినాయకచవితి ఉత్సవాలు

గుంటూరు: గత ఐదు రోజులుగా లాలుపురం గ్రామంలోని జనసేన పార్టీ ఆఫిస్ లో గణపతి మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుచున్నామని లాలుపురం జనసేనపార్టి ఆఫిస్ ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పూజ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమం మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగుతున్నదని, లాలుపురం జనసేన పార్టీ ఆఫిస్ ఇన్చార్జి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం చిరంజీవి నూకల శ్రీరితిక కూచిపూడి నృత్యప్రదర్శన తోటి అద్బుతంగా చూపరులను ఆకట్టుకుంటుంది. తదనంతరం చిరంజీవి నూకల శ్రీరితికకు జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య ప్రెజెంటేషన్ ఆందించినారు. శీలం శ్రీహరి, ఆదూరి శివయ్యలు శ్రీరితికను శాలువాతో ఘనంగా సత్కరించినారు. ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమం పూర్తెన తర్వాత స్వామి వారి తీర్దప్రసాదాలను భక్తులందరికీ అందించటం జరుగుచున్నది. శనివారం 7వ రోజు కనకతప్పెట్లు తోటి, కోలాటం, చెక్కభజనలతో భారీ ఊరేగింపుగా వినాయకుని నిమజ్జనంతోటి కార్యక్రమం పూర్తి అవుతుందని జనసైనికులు తెలియజేశారు. ఈ ఏడు రోజులు అన్ని కార్యక్రమాలకు సహకరించిన ప్రతి జనసైనికునికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.