మాడుగులలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాడేరు: జి.మాడుగుల మండల కేంద్రంలోగల జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ భీమా పత్రం, జనసేనాని రాజకీయ ప్రస్థానంతో కూడిన మనోగతం తెలిపే పుస్తకం జనసైనికులకు స్థానిక మండలనేతల సమక్షంలో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ స్వయంగా అందించారు. ఈ సందర్బంగా ఇన్చార్జ్ డా. గంగులయ్య మాట్లాడుతూ ప్రతి జనసైనికుడికి భీమా సౌకర్యం కల్పించడమంటే సాధారణ విషయం కాదు సమాజం భద్రత కొరకు రాజకీయ ప్రక్షాళన చేయాలని తలిచిన నేత మీ కోసం కూడా భద్రత కల్పించాలనే ఆలోచనలో పుట్టినదే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. మార్పుకోరకు నిర్విరామంగా పనిచేసే సైనికులు ఉన్నంత కాలం జనసేనాని తన సైన్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా భద్రత కలిపించాలో క్షున్నంగా అధ్యయనం చేసి ఈ సౌకర్యం కలిపించారు. యావత్ భారత దేశంలో ఏ రాజకీయపార్టీ చేయని అంశాన్ని మన జనసేనపార్టీలో చేర్చారు. ఇక రాష్ట్ర ప్రజలపై తనకున్న అంకితభావం గాని, ప్రజాక్షేమ పాలన విషయంలో గాని ఎటువంటి మార్పులు తేగలరో మనం అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో మనమంతా జనసంద్రమై మార్పుకోరకు పాటుపడితే కనీసం గిరిజన సంస్కృతి, చట్టాలు, హక్కులైన కాపాడుకోగలం. అభివృద్ధి మాట దేవుడెరుగు ఈ ప్రభుత్వంలో కనీసం అభివృద్ధి అనే పదం పలకడానికి కూడా సగటు గిరిజనుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి. మొదట నుంచి జి.మాడుగుల మండలం మార్పుకోరే రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న మండలం ఇందులో ఏ సందేహం లేదు కానీ ప్రత్యర్థులు ధనబలం, అధికార బలం కలవారు వారి కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి మనదైన పోరాటపటిమని చూపించాల్సిన సమయమిదే మీరందరు రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. మండల స్థాయి నాయకులు ప్రతిగ్రామంలో పర్యటన చేస్తూ ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళతో పార్టీ పరమైన ఆలోచన విధానంపై సమగ్ర చర్చలు చేస్తుండలని అదే సమయంలో మీకు జనసైనికుల పరస్పర సహాయ సహకరలుంటుందని ఆ విధమైన ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున జనసైనికులు మండల నాయకులు అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యదర్శి గొంది మురళి, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకట రమణ, వీరమహిళ కంట లక్ష్మీ, జర్ర అంకిత్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, ఉపాధ్యక్షులు ఈశ్వర్రావు, మసాడి సింహాచలం, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్, యూత్ అధ్యక్షులు ఎస్.కె మస్తాన్, బూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, నాగేశ్వరరావు, సోమన్న, తదితర జనసైనికులు పాల్గొన్నారు.