వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో పడకేసిన అభివృద్ధి

సర్వేపల్లి: మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామ పంచాయతీలో గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు ఆయన మట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పూర్తిస్థాయిలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల్లో మాట ఇచ్చి గెలిచి, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు. గ్రామాల్లో కాంట్రాక్టర్లు సైడ్ కాలువలు నిర్మించినప్పటికీ వాటిల్లో కనీసం మురుగునీరు పారటం లేదు. మరి కొన్నిచోట్ల మురుగునీరు పోయే వసతి కల్పించలేదు. వైసిపి నాయకులు వారి స్వలాభం కోసం కాంట్రాక్టర్ల చేత కొన్నిచోట్ల మురుగునీరు కాలువలు నిర్మించినప్పటికీ అవి నామం మాత్రంగానే పరిమితమై వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వర్షాకాలంలో సైడ్ కాలువలలో మురుగునీటితోపాటు వర్షపు నీరు చేరి అవి నిల్వ నిలిచి అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటు రోగాల బారిన ప్రజలు పడితే వారికి సరైన వైద్యం కూడా దొరికే పరిస్థితి లేదు. సైడ్ కాలువలలో మురుగునీరు పారెందుకు అవకాశం లేక మురుగునీరు నిలిచి ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ కోట్టించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లు కూడా వెలగడం లేదు, వీధి లైట్లు వెలిగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జనసేన పార్టీ తెలిపిన పనులు పరిష్కరించిన పక్షంలో వీరంపల్లి గ్రామపంచాయతీలో టీడీపీతో కలిసి సైడ్ కాలువలలో బ్లీచింగ్ కొట్టించి, వీధి లైట్లు వెలిగించుతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఈ కార్యక్రమంలో స్థానికులు శ్రీను, సుధాకర్, సుబ్రమణ్యం, వెంకయ్య, సర్వేపల్లి నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు ఖాజా, జనసేన పార్టీ వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.