పోలీస్ స్పొర్ట్స్ లో పాల్గొన్న రామ్ చరణ్..

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోలీస్ ఆద్వర్యం లో నిర్వహించిన 3 వ వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ -2021 ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ట్విటర్ ద్వారా తెలిపారు. ” 3 వ వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ -2021 ముగింపు వేడుకలో పాల్గొనడం నా ఎంతో ఆనందన్ని ఇచ్చింది. ఇందులో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ – శ్రీ. వి.సి. సజ్జనార్ గారికి నా కృతజ్ఞతలు ” అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.