జనసేన పార్టీ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మండలం, ఇన్నేశ పేట గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న సభ్యులు, ఇద్దరు దుంగు జగన్నాథం, దుంగు నూకరాజులు గత 6 నెలలు క్రితం యాక్సిడెంట్ కి గురవడంతో వారు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం వలన ఇద్దరికీ ప్రమాద బీమా చెక్కులు జనసేన ప్రధాన కార్యాలయమ్నుండి రావడం జరిగింది. దుంగు జగన్నాథం 50,000 రూపాయలు, దుంగు నూకరాజు 15000 రూపాయల చెక్కులను శుక్రవారం జనసేన పార్టీ సమావేశంలో గ్రామ పెద్దలు సమక్షంలో జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు చేతుల మీదుగా బీమా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, మున్సిపాలిటీ ఇంచార్జ్ రోకళ్ళ భాస్కరరావు, జనసేన నాయకులు దుంగు జగన్నాథం, దుంగు నూకరాజు, రంగానాధ్, ధర్మ రాజ్, కృష్ణ రావు, ఆదినారాయణ, రాముమూర్తి, శంకర్, దామోదర్, పురుషోత్తం, సూరి, గోపి, కుమార్, తారకేష్, రాజు, నరేష్, శ్రీను, ఢిల్లేష్, ప్రసాద్, లక్ష్మయ్య, ఋషి, తదితరులు పాల్గొన్నారు.