రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది: డా. గంగులయ్య

పాడేరు: చింతలవీధి పంచాయితి నడిమివీధి, ఉబ్బెడు పుట్టు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శుక్రవారం గ్రామస్తులతో జనసేన నాయకులు సమావేశమయ్యారు. స్థానిక నడిమి వీధి గ్రామ నాయకులు సుమన్, సుబ్బారావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ పాడేరు (అరకు పార్లమెంట్) ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు జనసేన పార్టీ నాయకుల బృందం హాజరయ్యారు. ఈ సందర్బంగా ముందుగా స్థానిక గ్రామస్తులు గంగులయ్యతో మాట్లాడుతూ అనేక ఎన్నికలు చూస్తున్నాం కానీ మా గ్రామానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని దుస్థితిపై ఎవ్వరు స్పందించట్లేదు జిల్లా ప్రధాన కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న మాకే అనేక సమస్యలున్నాయి. మౌళికసధుపాయలు కల్పనలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులకు శిత్తశుద్ధి లేదు ఇక మారుమూల పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయో అర్థమవుతుందన్నారు. మా గ్రామ భూములు వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి, వారి పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి మా అనుమతి లేకుండా ఏ అధికారంతో నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదని వాపోయారు. గ్రామస్తులతో గంగులయ్య మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అనేక రంగాల్లో వైపల్యం చెందిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి మాట తప్పుతూ పాలన చేస్తున్న దుర్భర స్థితి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే గిరిజనులు తమ అస్తిత్వం కోల్పోయే దుస్థితికి రావడం కాయమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు రైతులు, శ్రామికులు, నిరుద్యోగులకు, ఇలా అనేక రంగాల్లో ఉన్న వివిధ రకాల వర్గాల ప్రజలందరినీ ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. నాలుగేళ్లలో నాలుగు జాబ్ కెలాండర్స్ ఒక్కటి లేదు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ద్వంద విధానాలు, అబద్ధాలు చాంతాడాంత జాబితా అవుతుందన్నారు. మేము ఇవాళ మీ గ్రామానికి జనసేన పార్టీ నాయకులుగా వచ్చాము మా వెనకాల తెల్ల చొక్కాలు వేసుకుని అవినీతి అక్రమాల్లో పేరున్న నాయకులు లేరు అందరూ యువకులు వున్నారు. వాళ్ళలో మన గిరిజన సమాజానికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే తపన ఉన్న నవతరం నాయకులు వున్నారు. మాది జనసేన పార్టీ ఇక్కడ జాతి నిర్మాతలు, నవయువ అభ్యుదయబావలున్నా నాయకులుగా చేయబడును అందుకు అహర్నిశలు శ్రామిస్తున్నాం. మేము గిరిజన జాతికోసం ఒక కొత్త నాయకత్వాన్ని నిర్మిస్తున్నాము. కచ్చితంగా భవిష్యత్ లో అసెంబ్లీలో అడుగుపెడితే ప్రభుత్వం ఏదీ చేసిన పొగడడానికి, బానిసత్వం ప్రదర్శించడానికైతే మేము సిద్ధంగా లేము అలాగే దిక్కులవైపు, గడియరాలవైపు, చూస్తూ సూటుకేసుల కోసం ఆలోసించి జాతిని తాకట్టు పెట్టె అసమర్థ, అవినీతి నాయకత్వం కోసం అయితే కాదు. మీరు మాకు అండగా ఉంటే మేము గిరిజన జాతికి రక్షణగా ఉంటాం ఇందులో రెండో ఆలోచనలేదు. ఇంకా మన గిరిజన వైసీపీ ప్రజాప్రతినిధుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిదన్నారు. మనం ఇల్లు అలికిన వెంటనే అరిష్టం గురించి ఆలోచన చేయకూడదని పెద్దలంటుంటారు మేము అదే చేస్తున్నాము. యావత్ నియోజకవర్గమంత కూడా ఇప్పుడు జనసేనపార్టీ వైపు చూస్తోంది ఏదో చేసేస్తుందని కాదు జాతి సంరక్షణ బాధ్యతలు, జటీలమైన సమస్యలు ఎంత బలంగా ఆ సవాళ్ళను స్వీకరిస్తుందని ఇవాళ గిరిజన జాతి మొత్తం ఆలోసిస్తుంది. మాకు తెలుసు పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తగ్గట్టుగానే మా ప్రణాళిక ఉంటుంది. మన గిరిజన పల్లెల అభివృద్ధి ఉంటుంది. మా రాజకీయాలు విలువలతో ఉంటుంది. జాతి అస్తిత్వాన్ని సూటుకేసుల్లో బందించేంత బలహీనమైన రాజకీయాలు మేము చేయలేము గిరిజన జాతి రక్షణ దృష్ట్యా రణమే శరణమని నమ్మి బలమైన సంకల్పంతో ఉరికే యువతరంతో రాజకీయాలు చేస్తున్నాం. మీకు ఈ రోజు మాట ఇస్తున్నాం. మీ గ్రామనికి సంబంధించి భూమి విషయంలో అది మీ హక్కు, మీ ఆస్తి మీరు మాకు తోడుంటే మీ ఉద్యమానికి తొలి అడుగుగా మేముంటాం. అవసరమనుకుంటే న్యాయపోరాటంలో ముందుండి నడిపిస్తాం. కచ్చితంగా అహంకారుల కొమ్ములు విరుస్తాము. జాతి సంరక్షణ, నిర్మాణం మా ప్రధమ బాధ్యతలు మనమందరు కలిసి సాగుదాము గిరిజన బ్రతుకుల్ని బలి పశువు చేసి పబ్బం గడుపుకునే స్వార్ధపు నాయకత్వాన్ని ఎదురిద్దాం. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్రప్రభుత్వమైన మనమంతా సమిష్టిగా ఎదుర్కొందాం. మన యుద్ధంలో ధర్మం ఉంటే మనం కచ్చితంగా విజయంసాధిస్తామన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులందరు జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై డా. గంగులయ్య చేతుల మీదుగా కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరి మేమంతా మీ వెంటనని గెలుపు కోసం మా శక్తి వంచన లేకుండా శ్రమిస్తామన్నారు. వారికి పార్టీలోకి ఇన్చార్జ్ గంగులయ్య సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు సుమన్, సుబ్బారావు, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, వీరమహిళ దివ్యలత, మజ్జి సత్యనారాయణ, సాలేబు అశోక్, లక్ష్మయ్య, సంతోష్ స్థానిక గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.