గాంధీ జయంతి సందర్భంగా బ్రహ్మస్త్రం కిట్ల పంపిణీ

గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ దమ్మున్న నాయకులు బ్రహ్మస్త్రం నాగు సోమవారం మహాత్మా గాంధీ జయంతి శుభ సందర్భంగా స్ఫూర్తి మహిళా అనాధ ఆశ్రమంలో తన బ్రహ్మస్త్రం కిట్లలోని మరికొన్ని వస్తువులు పంచి పెట్టడం జరిగింది. అయితే గాజువాక నియోజకవర్గంలో దాదాపుగా 6 అనాధ ఆశ్రమాలు ఉన్నాయి. వారందరికీ కూడా బ్రహ్మస్త్రం నాగు తన శక్తికి మించి తన బ్రహ్మ స్త్రం టీం ద్వారా ఇలా 1000 మంది అనాధ బిడ్డలకు ఆకలి తీర్చడంలో ఇంకా వారందరికీ నాణ్యమైన చదువుని ఉచితంగా అందించడంలో బ్రహ్మస్త్రం నాగు తన బ్రహ్మస్త్రం టీం ద్వారా దాదాపుగా 20 రకాల నాణ్యమైన వస్తువులను కొని ఒక కిట్టుగా తయ్యారు చేసి దానికి బ్రహ్మస్త్రం కిట్టు అంటూ నామకరణం చేసి ముందుగా ఈ 1000 మంది అనాధ బిడ్డలకు ఉచితంగానే పంచి పెట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 14న బాలల దినోత్సవం పండుగ శుభ సందర్భంగా దుప్పట్లు మరియు రైస్ బాగ్స్ కూడా అందించడం జరుగుతుందని. మా 7 టీమ్స్ కీ కూడా ఆర్ధికంగా అండగా ఉంటున్న కుటుంబ సభ్యులకి మరియు మా 7 టీమ్స్ మిత్రులకు పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదములు తెలియ చేస్తున్నామని బ్రహ్మస్త్రం టీం తెలిపారు.