జూబిలీహిల్స్ జనసేన కార్యాలయంలో మహాత్మునికి ఘననివాళి

తెలంగాణ, హైదరాబాద్, జూబిలీహిల్స్ ప్రశాశన్ నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కార్యాలయంలో వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన ఒఆర్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, లీగల్ సెల్ చైర్మన్ ప్రతాప్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, పర్యవేక్షణ సభ్యులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.