టీడీపీ రిలే దీక్షలకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సంఘీభావం

  • పాదగయ సెంటర్ నుండి నిరసన దీక్షశిబిరం వరుకు ర్యాలీ
  • శాంతియుతంగా దీక్ష చేస్తున్న శిబిరంపై దీపావళి బాంబులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్
  • కక్ష్య సాధింపు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచివి కావు అని హితవు
  • దుష్ట శక్తులు వారాహి మీద రాళ్లు వేస్తాం అంటే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం
  • అక్రమ అరెస్టులకు సంబంధించి జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: బుధవారం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 22వ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణం మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. పాదగయా సెంటర్ నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ గారితో పాటు నియోజకవర్గం నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ 14సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేయడం చట్టాన్ని అపహస్యం చేయడమేనని, ఋజువులు ఉంటే ప్రజలకు తెలపాలని, కక్ష్య సాధింపు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచివి కావు అని ప్రభుత్వానికి హితువు పలుకుతూ పిఠాపురంలో శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న దీక్ష శిబిరంపై వైసీపీ గూండాలు అక్రమంగా దాడులు చేసి, రెచ్చకొట్టే విధంగా వ్యవహరిస్తూ, శిబిరంపై దీపావళి బాంబులతో దాడికి తెగబడ్డతీరును ఖండిస్తూ, గాయపడిన టిడిపి కార్యకర్తలును పరామర్శించారు. అదేవిదంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో అల్లర్లు సృష్టించాలని రాళ్ల దాడి చేయాలని చూస్తున్న దుష్ట శక్తులును సహించేది లేదు అని హెచ్చరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి పోరాడి ఈ సైకో ప్రభుత్వన్నీ గద్దె దింపుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు పిఠాపురం మాజీ శాసన సభ్యులు ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.