పాలకుర్తి నియోజకవర్గంలో జనసేన పోటీకి సిద్ధం

తెలంగాణ, పాలకుర్తి నియోజకవర్గం: పాలకుర్తి జనసేన పార్టీ ఇన్చార్జ్ వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వెల్తూరి నగేష్ మాట్లాడుతూ మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో 32 నియోజకవర్గాలు పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ 32 స్థానాలలో పాలకుర్తి నియోజకవర్గం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మిత్రులారా పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం జరుగుతుందని అదేవిధంగా అక్టోబర్ నెలలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు ఈ బహిరంగ సభ కోసం ఒక ప్రచార వెహికల్ కూడా ప్రారంభిస్తున్నాము త్వరలో మీకు ఈ విషయాలు ప్రకటిస్తాము. ఈ సమావేశానికి హాజరైన ఎలక్ట్రాన్ మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొండ్లె ఉమేష్, ఉపాధ్యక్షులు పోరండ్ల సందీప్, డివిజన్ ఉపాధ్యక్షులు జలకం శివ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతల మధు, పెద్దవంగర జనసేన పార్టీ మండల అధ్యక్షులు కసరబోయిన రాజశేఖర్, ఉపాధ్యక్షులు గద్దల అశోక్ తొర్రూరు మండల యువ నాయకులు వాంకుడోత్ పవన్ కళ్యాణ్, గంధం మురళి, జాలిగామ శోభన్ తదితరులు పాల్గొన్నారు.