పారాధి బ్రిడ్జ్ కు మరమ్మతులైనా చేపట్టండి: బాబు పాలూరు

  • బొబ్బిలి, పారాధి కొత్త బ్రిడ్జ్ ఎలాగూ చేపట్టలేకపోయారు, కనీసం ఉన్న పాత బ్రిడ్జ్ కూలిపోకుండా దోచుకున్న నిధుల నుంచి ఖర్చు చేసి బాగు చేయండి – జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: పారాది గ్రామం వద్ద ఒరిస్సా – ఆంధ్రా రాష్ట్రాలను కలిపే ప్రధాన వంతెనలలో ఒకటైన వంతెన ఇటీవల కుంగిపోయిన నేపథ్యంలో వంతెనను పరిశీలించిన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, జనసేన నాయకులు లెంక రమేష్, పల్లెం రాజా, మోతి దాసు, ఉమా మహేష్, కనకాల శ్యామ్, చీమల సతీష్, అల్లు రమేష్, పొట్నూరు జన, ఎందువ సత్య, వెంకట రమణ, జగన్నాథం, చంద్రమౌళి, గౌరీ శంకర్, మణికంఠ మరియు వీరమహిళలు బంటుపల్లి దివ్య, గైనేడి రమ్య, అలివేలు మరియు పారాది, అప్పలరాజుపేట జనసైనికులు. ఈ సందర్భంగా బాబు పాలూరు అక్కడి అధికారులు మరియు కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్ చేసారు. గతంలో 40 లక్షల రూపాయలతో మరమ్మత్తులు పేరు చెప్పి కనీసం 4 లక్షల రూపాయల పని కూడా చెయ్యకుండా ఎమ్మెల్యే కనస్ట్రక్సన్ యార్డులో ఉన్న నాలుగు తారు డబ్బాలు తీసుకొచ్చి సింగిల్ లేయర్ తారు వేసేసి ఈరోజు ఏకంగా బ్రిడ్జి కూలిపోయే ప్రమాదకరమైన స్థితికి తీసుకొచ్చారని బాబు పాలూరు దుయ్యబట్టారు. ఇపుడు ఏదో కంటి తుడుపు చర్యల కింద ఎమ్మెల్యే ఆస్థాన కాంట్రాక్టర్ ని పిలిచి నాలుగు తుప్పు పట్టిన ఐరన్ ఫ్రేమ్స్ తీసుకొచ్చి బ్రిడ్జి క్రింద సపోర్ట్ గా పెట్టి, వాహనాలకు యాక్సెస్ ఇచ్చేస్తామని చెప్పడం చూస్తుంటే, ప్రజల ప్రాణాలంటే ఈ వైసిపి ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఆలోచించండని, దయచేసి అధికారులు చొరవ తీసుకుని గ్రౌండ్ నుంచి ఒక పది అడుగుల లోతులో కాంక్రీట్ బేస్మెంట్ కట్టి స్టీల్ స్ట్రక్చర్స్ నాలుగు వైపులా లేపి బ్రిడ్జ్ కి సపోర్ట్గా అటాచ్ చేస్తే రిస్క్ లేకుండా ఉంటుందని బాబు పాలూరు అధికారులకు సూచించారు. లేదంటే రానున్న అతి భారీ వర్షాల వలన వచ్చే వరదల్లో ఇప్పుడు వీరు ఏర్పాటు చేస్తున్న తుప్పు పట్టిన స్టీల్ ఫ్రేమ్ లు కొట్టుకుపోతాయని, నేరకుపోయి వైసిపిని గెలిపించిన పాపానికి ప్రజలను దయచేసి ప్రమాదపు అంచుల్లో ఉంచొద్దని బాబు పాలూరు కోరారు. 2024లో జనసేన టీడిపి సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే పారాధి మరియు సీతానగరం మరియు పూర్ణపాడు బ్రిడ్జిలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని మీడియాకి చెప్పారు.