నాతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగా..

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా పవన్ ప్రస్తుతం ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఏఎం రత్నంతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని వెల్లడించారు.

తనకు నెల్లూరులో ఓ స్నేహితుడు ఉన్నాడని, అతను ఏఎం రత్నంకు బంధువు అని తెలిపారు. ఆ విధంగా తన స్నేహితుడి ద్వారా రత్నం పరిచయం అయ్యారని, చెన్నైలో తరచుగా కలుస్తుండేవాడ్నని వివరించారు. అయితే, తనతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగానని, మరే నిర్మాతను ఆ విధంగా అడగలేదని పవన్ వెల్లడించారు. తన కెరీర్ లో చిరస్మరణీయ చిత్రం ఖుషీ ఏఎం రత్నం బ్యానర్ నుంచే వచ్చిందని చెప్పారు. మున్ముందు ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.