శింగణమల నియోజకవర్గాన్ని సాంబశివారెడ్డికి రాసిచ్చారా?: శశిరేఖ

  • శింగణమల ఎస్సీ నియోజకవర్గమా లేక రెడ్ల నియోజకవర్గమా?
  • ముకుందాపురం గ్రామంలో దళిత నాగరాజుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం

సింగనమల: అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలను కాలరాసేలా శింగణమల నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడులను గమనిస్తే ఇది ఎస్సీ నియోజకవర్గమా లేక అగ్రవర్ణాల నియోజకవర్గమా అని తెలియాలని శశిరేఖ మండిపడ్డారు. ముకుందాపురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని దళిత నాగరాజు సమస్యలపై ప్రస్తావిస్తే సమాధానం చెప్పకుండా సాంబశివరెడ్డి ఆయన అనుచరులు హేళన చేస్తూ కులం పేరుతో ఆయనని దూషిస్తూ నెట్టివేసిన ఘటనను తెలుసుకొని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ ఆయనని పరామర్శించడం జరిగింది. జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ మాట్లాడుతూ శింగణమల నియోజకవర్గం వర్గానికి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే నా లేక ఆలూరు సాంబశివరెడ్డి నా అని ప్రశ్నించడం జరిగింది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన దళిత నాగరాజు పై ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి ఆయన అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేసి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు అడిగినందుకు దళిత నాగరాజు పై అవహేళనగా మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడడం హేమమని అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో దళితులపై ఇలా వరుస దాడులు చూస్తుంటే తాము ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నామా లేక అగ్రవర్ణాల నియోజకవర్గంలో ఉన్నామా అని దళితులు ఆవేదన చెందుతున్నారని.. దళిత నాగరాజు పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజలు నాయకులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఘాటుగా స్పందిస్తూ రాబోవు రోజులలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ మండిపడడం జరిగింది.