ఏపీ సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 12 వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి 65 పై అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని కోర్టులో కేసు దాఖలైంది. ఇందులో వైఎస్ జగన్ ను ఏ1 గా పేర్కొన్నారు. మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేయగా, వారిపై ఉన్న కేసులను చాలా కాలం క్రితమే కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా పోలీసులు చార్జీ షీట్ దాఖలు చేసింది. దీంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 12 వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.