ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన తెలంగాణ సర్కార్

తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వాళ్లకు ఉద్యోగభద్రత కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం పెట్టారు. అయితే తమకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాయమని.. చాలా సార్లు ఉద్యోగాలు కూడా కోల్పోతున్నామని.. ఆర్టీసీ కార్మిక సంఘాలు గతంలో సీఎంకు విన్నవించాయి.ఈ నేపథ్యంలో ఉద్యగ భద్రత కల్పిస్తామని సీఎం వాళ్లకు హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగభద్రత కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమకు జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్మె అనేక మలుపులు తిరిగింది. ఓ దశలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను నడిపించింది. ఉద్యోగులను డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు కూడా తీసేసింది.

ఆ తర్వాత మళ్లీ సీఎం కేసీఆర్ వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే పలు ఉద్యోగసంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై కొన్ని హామీలు ఇచ్చారు. నష్టాల ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సూచనలు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటీగా హామీలు నెరవేరుస్తున్నారు. అయితే కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. నష్టాలను నివారించేందుకు ఆర్టీసీ కార్గో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్గో సర్వీసులు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి.