వనపర్తిలో పోటీ చేయడమే లక్ష్యం: ముకుంద నాయుడు

  • ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
  • విజయవంతంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం

తెలంగాణ, వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం సమీపంలో ఆదివారం జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి జనసైనికులతో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌక్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం అక్కడి నుంచి తిరిగి ర్యాలీగా పార్టీ కార్యాలయం చేరుకొని క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుపుకున్నట్టు జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయాల పైన జనసేన పార్టీ రాబోయే ఎన్నికలలో వెళ్లాల్సిన విధానం, వచ్చే ఎన్నికల్లో పోటిలో కచ్చితంగా నిలిపే విధంగా జనసేన మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదిగే దిశగా తగు కార్యచరణ రూపొందించడం జరిగిందనీ దానికి తగినట్లు అన్ని మండల కమిటీలు నియమించడం పూర్తి అయ్యిందనీ, జనంలోకి జనసేన కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతూ గ్రామ కమిటీలు నియమించడం, అనేక అంశాల మీద పార్టీ బలోపేతానికి కావాల్సిన, విధివిధానాలు ప్రజా సమస్యలపైన పరిష్కారమయ్యే స్థానిక సమస్యలకు మీద ప్రజలకు అనుగుణంగా వెళ్లాల్సిన విధానాలు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా జన సైనికులను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామస్థాయిలో బలమైన శక్తిగా ఎదిగే పార్టీగా యువత పెద్ద ఎత్తున అండగా ఉంటూ, పేద వర్గాల కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే వారి సమస్యల ఎజెండాగా వారిని రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీని నిర్మించిన ఆశయంతో వెళ్తామని వివరించారు. ఆ దిశగానే జనసేన పార్టీ కోసం నిత్యం మనం పాటుపడి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని వనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరువ చేసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆయన ఆలోచిస్తున్నా విధానాన్ని రాజకీయంగా వాళ్లకు కల్పిస్తున్న అవకాశాలను ప్రజలకు చేరవేసి భవిష్యత్తులో డబ్బుతో ముడిపడిన రాజకీయం కాకుండా సిద్ధాంతంతో ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకులను స్వచ్ఛందంగా ముందుకొచ్చే నాయకులని జనసేన పార్టీ ముందుండి నడిపిస్తుందని ఆ దిశగానే మనం ముందుకెళ్లాలని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలని, రాజకీయ చైతన్యం కలిగిన యువకులను ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్లను గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే విధంగా జనసేన పార్టీ వివిధ స్థాయి నాయకులు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూల్ ఇంచార్జీ వంగ లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి జిల్లా నాయకులు కొల్లాపూర్ కో-ఆర్డినేటర్ సాంబ శివుడు, వనపర్తి జిల్లా నాయకులు బాలకృష, రాకేశ్ రెడ్డి, సోషల్ మీడియా నాయకులు హేమవర్ధన్, ముఖ్య నాయకులు సురేష్ యాదవ్, ఉత్తేజ్, శరత్ గౌడ్, గోపాల్, అనిల్, మూర్తి నాయక్, విజయ్, సురేష్, కృష్ణ, శ్రీనివాస్, ప్రకాశ్, రామేష్, రఘు, మల్లి, పవన్ తదితరులు పాల్గొన్నారు.