టిడిపి నిరసన దీక్షకు జనసేన మద్దతు

చిలకలూరిపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయడు అక్రమ అరెస్ట్ పై టిడిపి పార్టీ తరుపున చేస్తున్న నిరసన కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి మద్దతు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి తోట రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి ఎల్ బి నాయుడు, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, చిలకలూరిపేట మండల ఉపాధ్యక్షులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు, మల్లా కోటి, కార్యదర్సులు పాపన హనుమంతరావు, బొందలపాటి సుబ్బారావు, వీర మహిళలు, పెద్దింటి సుమలత, అమరేశ్వరి, పట్టణ నాయకులు అచ్చుకోల అరుణ్ కుమార్, పగడాల, ఎస్ ఆర్ శ్రీను, తోటకూర అనిల్, సాంబశివరావు, నాగేశ్వరరావు, కన్నా, తేజ, సాయి, కోటి, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.