కాపు సంక్షేమ సేన రైతుకు వందనం పోస్టర్ రిలీజ్

తిరుపతి: రైతుకు వందనం అనే కార్యక్రమం ద్వారా సంక్షేమ సేన అధినేత చేగొండి హరి రామ జోగయ్య పిలుపు మేరకు తిరుపతి జిల్లాలలో సెప్టెంబర్ నెలలో రైతులతో రాష్ట్రస్థాయి సమావేశం జరుపుకోవాలని ఆదేశించారు కనుక జిల్లా నాయకులతో కలిసి సోమవారం తిరుపతిలో ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దలు బత్తెన మధు బాబు ఆదేశాల మేరకు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో రైతుకు వందనం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బత్తెన మధు బాబు, జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ సేన తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారసాని రమేష్ బాబు, కొండా రాజా, హిమవంతు, వేణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.