పెద్దపల్లి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ

తెలంగాణ, పెద్దపల్లి: జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం సుల్తానాబాద్ మండలం, గర్రేపల్లి గ్రామంలో పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు రాసూరి హరిక్రిష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు లొల్లి శివ, నీరజ్, అజయ్, జెట్టి శ్రీకాంత్, జెట్టి సాగర్, పులి పవన్, వడ్లకొండ శ్రీకాంత్, పున్నా సతీష్ తదితరులు పాల్గొని నియోజకవర్గ క్రియాశీలక జనసైనికులకు సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి అనిల్, గోసికొండ రాజు, ఉత్తెం శ్రీకాంత్, జెట్టి దినేష్, ఏడ్ల రవి, ముత్తొజు రవి, గోసికొండ శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.