గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి: శివకోటి యాదవ్

తెలంగాణ, నర్సంపేట నియోజకవర్గం, ఈరోజు చెన్నారావుపేట మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మెరుగు శివకోటి యాదవ్ “జనంతో జనసేన- ప్రజా బాట” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గంలో పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలో ప్రధాన కార్యదర్శి గాండ్ల అరుణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ పాల్గొని ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను, తమ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నియోజవర్గంలో చేసినటువంటి ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను వివరించి, జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని,సామాన్యులకు అండగా ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంగ మధు ఓర్సు రాజేందర్, కుండె రాజ్ కుమార్, సాయి ఈశ్వర్, ఎలబోయిన డేవిడ్, బొబ్బ పృధ్వీరాజ్, కిరణ్, అభిషేక్, రాకేష్ పాల్గొన్నారు.