లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ జగన్: కిరణ్ రాయల్

  • మంగమ్మ గారి మునిమనవడు జగన్ రెడ్డి
  • సున్న, సున్నా కలిపి చెప్పనికి కూడా చీటీ చూసి చెప్పే ముఖ్యమంత్రి నువ్వు.

తిరుపతి, సిఎం జగన్ మా అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలడం తప్ప ఢిల్లీకి వెళ్లి ఏమి చేశాడో, ఎందుకు వెళ్ళాడో చెప్పడు ఎందుకు! టిడిపి, జనసేన అలయెన్స్ తర్వాత ప్రస్టేషన్ ఎక్కువైపోయాయి జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడని, అలయెన్స్ కుదరటంతో భయపడుతున్నాడు. జగన్ ముత్తాతకు భార్య ఉండగానే, మంగమ్మ అనే మహిళను చేరదీశాడని, అమెకు పుట్టిన వ్యక్తి రాజారెడ్డి అని ఆ సంతతికి వారసుడు సీఎం జగన్ అని, జగన్మోహన్ రెడ్టి మంగమ్మ గారి మనవడు అని, నీ కుటుంబ సభ్యులనడిగితే నీ చరిత్ర చెబుతారని, మీ బిడ్డ గురించి మీ తల్లి విజయమ్మను అడిగితే చెబుతుందని, ప్రతి ఒక్కటి చీటి చూసి చదువుతుంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని, మా నాయకుడి వివాహం వల్ల. ఎవ్వరికి నష్టం లేదని, లోకల్, నేషనల్, ఇంటర్నెషనల్ వివాహము వల్ల ఎవ్వరికి నష్టం కలగలేదు కానీ.. మీరు కూడా కావాలంటే భారతమ్మకు విడాకులు ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు అని, సియం జగన్ మోహన్ రెడ్డి లోకల్, నేషనల్, ఇంటర్ నేషనల్ క్రిమినల్ స్థాయి కూడా దాటిపోయాడని, ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నాడని, ఆ బెయిల్ రద్దయితే నీ పరిస్థితి ఎక్కడో ముందు అది చూసుకోవాలని, కాపులు మీదా ఎన్నడూ లేని ప్రేమ వెలుగబోస్తున్న జగన్ నలుగురు పనికి‌మానిన కాపుల కు మంత్రి పదవులు ఇచ్చి, కాపులు మొత్తాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్లు ఫీలవుతున్నాడని. రాష్టంలో ఎలాంటి అనర్థము జరిగిన పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల్ల వల్లేనే అన్నట్లు మాట్లాడటం మీకు పరిపాలన చేతకాక, చేయ్యలేక కప్పిపుచ్చుకునే మాటలని ప్రజలకు చక్కగా అర్థమవుతుందని, దమ్ముంటే మూడు వివాహాల మీదా కేసు పెట్టండి లేదా రాజ్యాంగంలో సవరణ తీసుకురండి, అంతేకాని రాజ్యాంగబద్ధంగా విడాకులు ఇచ్చి చేసుకున్న వివాహాల గురించి హేళన చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఉందని, దీనిపై ఉన్నత న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ ఐటి రిటర్న్స్ తీసుకొండి ముకు లావా దేవీలు తెలుస్తాయని, గతంలో మా పార్టీ ఆఫీసులో మా అధ్యక్షులు ఆయన సంపాదన ఎంత, ఖర్చులు ఎంత అనేది మీడియా ముఖంగా లెక్కలు చూపించారని.. చేతనైతే మీరు, మీ ఎమ్మెల్యేలు మీడియా ముఖంగా మీ ఆర్థిక లావాదేవీల వివరాలు చెప్పగలరా, చెప్పే దమ్ము మీకు ఉందా అని, ఎంత ప్యాకేజ్ తీసుకోని రాజ్యసభ సభ్యుడిగా రిలయన్స్ వారికి ఇచ్చారో చెప్పగలరా అని, మీ భార్యతో కలసి ఎందుకు హిందు దేవాలయాలకు రారు అని, నీలా ఎలక్షన్ ముందు ఒకలా, ఎలక్షన్ తర్వాత ఒకలా నటించడం మా పవన్ కళ్యాణ్ కు చేతకాదని గురువారం తిరుపతిలో మీడియా ముఖంగా జనసేన నేత కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. ఈ మీడియా సమావేశంలో పార్థు, వినోద్, లోహిత్, ఆది, సాయి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.