ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన శ్రీమతి పోలసపల్లి సరోజ

  • దమ్ముంటే జగన్ రెడ్డి హెలికాప్టర్ లో కాదు రోడ్డు మార్గంలో ప్రజల ముందుకు రావాలి.
  • పరదాలూ దాటి సమస్యలు తెలుసుకోవాలి.
  • పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ దత్తపుత్రుడే
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సామర్లకోట పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉందని జగన్ రెడ్డికి దమ్ముంటే పులివెందుల నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీ చేసి నెగ్గాలని జనసేన పార్టీ తరపున సరోజ సవాల్ విసిరారు. 33 లక్షల ఇళ్లల్లో కాకినాడ స్థానం ఎక్కడ? అని ప్రశ్నించారు! జనం విఙులని, మసి పూసి మారేడుకాయలు చేస్తే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సరోజ అన్నారు. 3000 మంది కౌలు రైతులకు సుమారు 30 కోట్ల రూపాయల సొంత నగదును అందించిన పవన్ కళ్యాణ్ వారికి దత్తపుత్రుడేనని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని, అటువంటి విలువలు లేని రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఇతర రాష్ట్రాలలో ఇళ్ళు లేవా అని ప్రశ్నించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబాల పైన, వ్యక్తుల పట్ల తమకు గౌరవం ఉందని, రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం చేతకానితనమేనన్నారు. కుల రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాబోయే రోజుల్లో జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 175 సీట్లలో జనసేన-తెలుగుదేశం పోటీ చేస్తాయన్నారు. ఎక్కడైనా పోటీ చేసే సత్తా జనసేన సొంతమన్నారు. పవన్ కళ్యాణ్ ని గాజువాక భీమవరం ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. పేద, బడుగు బలహీన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ని తెలియచేశారు. ప్రభుత్వ ఖజానా సొమ్మును బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నగదు జమ చేస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మద్యం, ఇసుక ఇతర వాటి నుంచి వస్తున్న అక్రమ నగదు కూడా అతని సొంత ఖాతాకే జమ చెసుకుంటున్నారని సరోజ అన్నారు. ఇకపై ఎదుట వారి వ్యక్తిగత జీవితాలపై దృష్టి తగ్గించి ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెడితే కనీసం డిపొజిట్లు కోల్పోకుండ ఉంటారని హితవు పలికారు.