పాలసీలమీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా..?

నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీనివాసులు మాట్లాడుతూ 2019 లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 ఎమ్మెల్యే లను గెలిపించి వైసీపి ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, గత ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడని కావచ్చు, ఏదొక విదంగా జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఈ ప్రభుత్వ ఏర్పాటే ప్రజా వేదిక కూల్చడంతో మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలల్లోనే ఆన్లైన్ ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బకొట్టి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఈ ప్రభుత్వం. ఇదే విధంగా ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర ఏళ్లలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అవినీతి అరాచక పాలన కొనసాగిస్తా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన వారిని నిలువరిస్తూ, బెదిరిస్తూ, అరెస్టులు చూపిస్తూ ఒక నియంత పాలన కొనసాగిస్తున్నారు. పాలనా పరమైన అంశాలమీద ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దాడులు చేయడం తప్పా వాటిపై సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ ప్రభుత్వానిది.

రాష్ట్రంలోని ప్రాథమిక అంశాలైన
1.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఇంకా పూర్తి చేయలేదన్నా,
2.రాజధాని నిర్మాణ ఏర్పాటు చేయలేదన్నా,
3.22 ఎంపీ లను ఇచ్చినా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదన్నా,
4.అధికారంలోకి వచ్చిన నెలలోనే సిపిఎస్ రద్దు చేస్తా అని మాట ఇచ్చి తప్పిన హామీ గురించి అడిగినా

  1. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదన్నా,
    6.అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నా, 7.విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదన్నా,
    8.టిడ్కో ఇల్లు ఇంకా పూర్తి చేయలేదన్నా,
    9.ఇసుక రేట్లు ఎందుకు పెంచారన్నా,
    10.గంజాయి అక్రమ రవాణా గురించి మాట్లాడినా,
    11.మద్య నిషేధం చేస్తా అని చెప్పి మద్యం ఏరులై పారుతున్నా మద్యం మత్తులో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం ఉండదు.
    12.రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే రోడ్లు వేయండన్నా,
    13.60 వేలు పైచిలుకు మహిళలు అదృశ్యం గురించి చెప్పామన్నా,
    14.కరెంటు చార్జీలు, ఆర్టీసి చార్జీలు ఇష్టారీతిలో పెంచారన్నా,
    15.ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు సరిగా లేవు అన్నా,

ఇంకా ఎన్నెన్నో ఈ నాలుగున్నర ఏళ్ళల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఈ పెద్ద మనిషి రాష్ట్ర సీఎం వీటిపై సమాధానం చెప్పలేక పెళ్ళాలు, పెళ్లిళ్లు అంటూ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతవిమర్శలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన గౌరవాన్ని కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారు తప్ప, వ్యక్తిగతంగా వివాహాలు దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయరు, రాష్ట ప్రజలు ఈ అరాచక పాలనని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేద్దామా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ఈ 2024 ఎన్నికలలో జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమికి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ అరాచక పాలన నుండి విముక్తి పొంది ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయండి అంటూ తాండ్ర శ్రీనివాసులు రాష్ట్ర ప్రజలను కోరారు.