జై భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

కాకినాడ: అంబేద్కర్ ఆశయాల పరిరక్షణ కోసం జనసేన పార్టీ త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పిట్ట జానకి రామారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ నగర్ లో ఉన్న జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ల హక్కుల కోసం పోరాటం సాగించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను జనసేన పార్టీ త్రికరణ శుద్ధిగా అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దళితులపై దాడులు జరుగుతున్న దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చలనం లేకుండా పోయిందని దానికి భిన్నంగా దళితుడిని చంపిన వ్యక్తిని వెంటేసుకుని ఇదే జిల్లాలో జరిగిన సమావేశానికి హాజరు కావడం చూస్తే దళితుల పట్ల ఉన్న అభిప్రాయం ఏంటో స్పష్టమవుతుందని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దగా పడ్డ దళితులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాసటగా నిలుస్తున్నారని అని జానకి రామారావు తెలిపారు. వీరమహిళలు బట్టు లీల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజాలు దళితులు పట్ల చులకనగా మాట్లాడడం దళితుల ఆత్మగౌరవని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అన్నారు. బండి సుజాత మాట్లాడుతూ జనసేన పార్టీ నేతృత్వంలో దళితులకు చముచిత స్థానం కల్పించిన నేపథ్యంలో దళితులంతా జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని దీనిలో భాగంగానే కాకినాడ నగరంలో రేపటినుండి జై భీమ్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు ముత్యాల దుర్గాప్రసాద్, కంట రవిశంకర్, పచ్చిపాల మధు, చిట్టి శేఖర్, వీరమహిళలు బోడపాటి మరియ బట్టు లీల, బండి సుజాత, దీప్తి భవాని, రమణమ్మ ఉమా తదితరులు పాల్గొన్నారు.