కె.ఎస్.ఎస్ రామచంద్రపురం నియోజకవర్గ మరియు మండల కమిటీ నియామకాలు

డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.ఎస్.ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు డి.ఎస్.ఎన్ కుమార్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గం కమిటీ మరియు మండల కమిటీల విస్తరణలో భాగంగా ఆదివారం నూతనంగా నియమించబడ్డ సభ్యులకు నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ, యూత్ ఇంచార్జి, సోషల్ మీడియా ఇంచార్జి చేగొండి నాని, యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బోనం గణేష్ కుమార్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు దిండు గణపతి, పశ్చిమగోదావరి జిల్లా యూత్ కార్యదర్శి పిల్లా సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గోలకోటి చిన్న, సంయుక్త కార్యదర్శి బల్ల ప్రసాద్, అల్లవరం మండల అధ్యక్షులు ఆర్.కె నాయుడు పాల్గొన్నారు.