రక్త దాతలు నిజమైన దేవుళ్ళు: వాసగిరి మణికంఠ

గుంతకల్, పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవాస్పూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణాధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా గుంతకల్ పట్టణం స్థానిక గోపి బ్లడ్ బ్యాంక్ నందు “మెగా రక్తదాన శిబిరం” పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి, జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించి నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వీరి అడుగుజాడల్లో నిత్యం నడిచే సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు, రక్తదాతలు ఎంతో ఉత్సాహంతో 141 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమని రక్తదాతల సేవ స్ఫూర్తిని కొనియాడారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదని, మానవ శరీరంలో సహజంగా తయారవుతుందని, అందుకే రక్తాన్ని రక్తదానం వల్లనే మరొకరికి అందివ్వగలమని, రక్త దానం చేయడం కొద్ది నిమిషాల పని, ఇది మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం బీజేపీ నాయకులు మంజుల వెంకటేష్ చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్, కొనకొండ్ల శివ, ఆటో రామకృష్ణ, రామకృష్ణ, ఆటో కృష్ణ, మంజునాథ్, అమర్నాథ్, బర్మశాల శేఖర్, శివకుమార్, ఆటో బాషా, మతం వీరేష్, కసాపురం మారుతి, ఆటో రామంజి, సూర్యనారాయణ, అనిల్ కుమార్, అల్లు రవి, కాపు సంక్షేమ సేన నాయకులు రంగా రాయల్, అఖిల్ రాయల్, హరీష్ రాయల్, కసాపురం వంశీ, బ్లడ్ డోనర్స్ హనుమంత్, నాసిర్, హరీష్, అల్లు మధు, వెంకీ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రక్తదాతలు పాల్గొన్నారు.