న్యాయానికి సంకెళ్లు- జనసేన, టిడిపిల నిరసన

తుని: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఒంటిమామిడి సెంటర్ లో జనసేన, టిడిపి పార్టీ ఆధ్వర్యంలో చేతులకు సంకెళ్లు ధరించి నిరసన తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బెండపుడి నాయుడు ఉపాధ్యక్షుడు ఖండవలి గణేష్ మండల అధికార ప్రతినిధి పేదిరెడ్ల దుర్గాప్రసాద్, కార్యదర్శి కొయ్యశ్రిధర్, గోవిందు, నగేశ్, అయ్యప్ప, అభిలాష్ తదితర జనసైనికులు పాల్గొని నిరసన తెలిపారు.