కేబిహెచ్బిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచన ప్రకారం సోమవారం కేబిహెచ్బి కాలనీ మూడవ ఫేస్ లో జనసేన నాయకులు ఇంటింటికి ప్రచారం చేస్తూ క్రియాశీల సభ్యులకు సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తుమ్మల మోహన్ కుమార్, కొల్లా శంకర్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ కలిగినీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.