వైసిపి నాయకులపై నిప్పులు చెరిగిన జనసేన వీరమహిళలు

  • ఓటమి భయంతోనే కిరణ్ రాయళ్ పై తప్పుడు ప్రచారం..
  • వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా రేపు జనసేనకే ఓటు వేస్తారు.
  • వెనక ఉండి మాట్లాడించడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడాలి.
  • కుల రాజకీయాలతో దుష్ప్రచారం చేయడం తగదు.
  • జనసేన పార్టీ వీర మహిళల సవాల్.

తిరుపతి, తమ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్. కిరణ్ రాయల్ ను టార్గెట్గా చేసుకొని. వైకాపా అధిష్టానం ఉప్పరపల్లి పేటీఎం బ్యాచ్ కి బాస్ ఎవరు.! మరికొందరు బలిజ కులస్తుల ద్వారా ప్రెస్ మీట్ లు పెట్టించి వైకాపా స్థానిక అధిష్టానం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, జనసేన పార్టీ స్టేట్ సెక్రెటరీ ఆకేపాటి సుభాషిని నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు జనసేన వీర మహిళలు చందన , దుర్గ, లావణ్య, రేఖ తదితరులతో కలిసి సుభాషిని మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జనసేనకు వెన్నెముకగా పనిచేస్తున్న కిరణ్ ను తుడిచి పెట్టేయాలనే వ్యూహంతో ఎందరో మహిళలను కిరణ్ రాయల్ వేధించారని ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ దిగజారుడు పాలిటిక్స్ చేస్తునందువల్లే నేడు వైకాపా ప్రజాదరణ కోల్పోయిందని దుయ్యబట్టారు. రానున్నది టిడిపి జనసేనల ఉమ్మడి ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషిగా ఉండాల్సింది పోయి కుల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు వారసత్వ రాజకీయాలు ఆ ఇంటి నుండి కొనసాగుతున్నాయని నేడు తండ్రి, రేపు తనయుడు, భవిష్యత్తులో మనవడు ఇదేనా పారదర్శక రాజకీయమంటే అంటూ తిరుపతి ఎమ్మెల్యేని ప్రశ్నించారు. వైసిపి వారు ఎన్ని దొంగ ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని, నిజాలుంటే సాక్షాదారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టాలని, జనసేన పార్టీ తరపున తాము హాజరవుతామని, నిజం నిగ్గు తెలుస్తామని హెచ్చరించారు.